ఆయన ముందు నేనెంత ?


 నేను టైమంటే టైమే. ఉదయం ఏడింటికి షూటింగ్ అంటే.. దానికి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయను అని  మెహరీన్ అన్నారు. నేను మాత్రమే కాదు, ఇప్పటి వరకూ నేను పనిచేసిన కథానాయకులంతా సమయపాలన ఉన్నవాళ్లే. 'ఎఫ్ 2' సమయంలో వెంకటేష్ గారిని దగ్గర్నుండి గమనించాను. ఆయన కూడా అంతే. అనుకున్న సమయం కంటే ముందే ఉండేవారు. 'అంత పెద్ద స్టార్ టైమ్ ని పాటిస్తే, నేనెంత..? అనిపించింది అని చెప్పింది మెహరీన్.