సుదీర్ఘ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ లో కాలు మోపింది. శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసిన కోహ్లి.. 'ఆక్లాండ్ లో అడుగుపెట్టాం' అనే వ్యాఖ్య జోడించాడు. అయిదు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారమే తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ తర్వాత కివీ' భారత్ మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో తలపడుతుంది.
న్యూజిలాండ్ చేరిన కోహ్లిసేన