తొలి T-20లో టీమిండియా విజయం


 న్యూజిలాండ్ తో జరిగిన తొలి T-20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. ఆదిలోనే రోహిత్ శర్మ(7) నిరాశ పరిచినా.. కేఎల్ రాహుల్(56), కెప్టెన్ విరాట్ కోహ్లి(45) జట్టును ఆదుకున్నారు. చివర్లో శ్రేయస్ అయ్యర్(58; 29 బంతుల్లో 5x4, 3x6), మనీశ్ పాండే( 14; 12 బంతుల్లో 1x6) ధాటిగా ఆడి జట్టును గెలిపించారు.