గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. విజయవాడలోని రాజ్ భవనక్కు పార్టీ నేతలతో కలిసి వెళ్లి శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వివరాలతో ఉన్న పెన్ డ్రైవ్ ను గవర్నర్ కు చంద్రబాబు అందజేశారు. ఛైర్మన్ పోడియాన్ని ముట్టడించి అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.