ఇంకా అక్కడ కూడా ఫుట్ బాల్ స్టేడియాల్లో మహిళలకు ప్రవేశం


 ఇరాన్లో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్లకు సుదీర్ఘ విరామం తర్వాత మహిళల్ని అనుమతించనున్నారు. ఇక్కడ దాదాపు 40 ఏళ్ల నుంచి ఫుట్ బాల్ స్టేడియాల్లోకి మహిళలకు ప్రవేశం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఇరానను అంతర్జాతీయ ఫుట్ బాల్ నుంచి బహిష్కరిస్తామని ఫిఫా హెచ్చరించడంతో మహిళల్ని స్టేడియాల్లోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం తెహ్రాన్లోని ఆజాది స్టేడియంలో జరగబోయే ఇరాన్-కంబోడియా 2022 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్లో మహిళలు సందడి చేయబోతున్నారు.