వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)లో కరెంటు ఛార్జీల పెంపు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. డిస్కంల ఆదాయ, వ్యయాల మధ్య లోటు వచ్చే ఏడాదికి రూ.11 వేల కోట్లకు చేరునుందని అంచనా. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. ప్రభుత్వ సహకారంతో ఎలాగోలా నెట్టుకొస్తున్నాయి.
డిస్కంలపై ఆర్థిక భారం