భూగోళంలో అత్యంత లోతున ఉండే 'ఇన్నర్ కోర్'ను ఆవరించి ఓ మంచు పొర ఉందని తాజా అధ్యయనమొకటి గుర్తించింది. సూక్ష్మ ఇనుము కణాలతో ఆ మంచు పొర రూపుదిద్దుకుందని వెల్లడించింది. భూమి పొరల్లో భూకంప తరంగాలు ప్రవహించినప్పుడు వెలువడే సంకేతాలను అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు విశ్లేషించారు. ఫలితంగా దాదాపు 200 మైళ్ల మందంతో 'ఇనుము మంచు పొర' అవతరించిందని వివరించారు.
భూమి లోలోతుల్లో మంచు పొర