షాద్ నగర్ ఎన్ కౌంటర్ పై విచారణకు సిట్


 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్ నగర్ ఎన్ కౌంటర్ పై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రాచకొండ CP మహేష్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వనపర్తి SP అపూర్వరావు, మంచిర్యాల DCP ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ DCP సురేందర్, సంగారెడ్డి DSP శ్రీధర్, సంగారెడ్డి CI వేణుగోపాల్ రెడ్డి సిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్ కౌంటర్ పై పూర్తి విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.