విహారయాత్రలా ఉంటుంది..పరిపాలన ఉండదు


 ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికే జగన్ 3 రాజధానుల ప్రకటన చేశారని CPI జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో సచివాలయాలు, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని, ఎక్కడా సచివాలయం, అసెంబ్లీ వేరుగా లేవని తెలిపారు. సచివాలయం ఒకచోట, మంత్రుల నివాసాలు మరోచోట ఉంటే విహారయాత్రలా ఉంటుంది తప్ప పరిపాలన సౌలభ్యంగా ఉండదని ఎద్దేవా చేశారు.