ఈ మధ్య కాలం లో కివి పండ్లు బాగా కనపడుతున్నాయి .. మిగతా పండ్లతో పోలిస్తే వీటిని చాలా తక్కువ మంది కొంటారు . కానీ, వీటి వల్ల కలిగే బ్యూటీ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు ఈ ఫ్రూట్స్‌ని వదలరు. ఈ పండ్లని రెగ్యులర్‌గా తినడం వల్ల చర్మం తాజాగా, అందంగా మారుతుంది. కాలుష్యం వంటి కారణాలతో చర్మం పొడిబారడం, తక్కువ వయసులోనే ముడతలు రావడం వంటి సమస్యలు వంటివి దూరం అవుతాయి. కివీలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్, నిమ్మ జాతి పండ్ల కన్నా దీన్లో ఎక్కువ మోతాదు లో విటమిన్ సి లభిస్తుంది . ఇది చర్మానికి కావాల్సిన పోషకాలన్నింటినీ ఇస్తుంది. దీని వల్ల స్కిన్ తాజాగా, అందంగా మారుతుంది.
ఆపిల్ తో పోలిస్తే కివి లో 5 రేట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయి . కొవ్వు, సోడియం తక్కువగా ఉంటాయి.. అందువల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు, గుండెసమస్యలు ఉన్నవారు కూడా ఈ పండుని హ్యాపీగా తినొచ్చని చెబుతున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల ఆరోగ్య, అందం పరంగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.