సింధు కథ ముగిసింది


BWF ప్రపంచ టూర్ ఫైనల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ పి.వి.సింధు కథ ముగిసింది. ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ సింధు లీగ్ దశ కూడా దాటలేకపోయింది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ ఓడి సెమీస్ బెర్తుకు దూరమైంది. రెండేసి విజయాలు సాధించిన అకానె యమగూచి (జపాన్), చెన్ యుఫెయ్ (చైనా)లు గ్రూప్-ఎ నుంచి సెమీస్ లో అడుగుపెట్టారు.