దంతాల నొప్పికి లవంగం నూనె..


దంతాల నొప్పికి లవంగాల నూనె భేషుగ్గా పనిచేస్తుంది. లవంగాల నూనెలో దూదిని నానబెట్టకుండా.. ఒకసారి ముంచి తీసేయాలి. ఆ తర్వాత నొప్పి అనిపించిన చోట ఉంచాలి. లేదంటే.. చిగుళ్లు మంటపుడతాయి. అలాగే ఆ ప్రాంతంలో వేడినీటితో అద్దుకోవడం లేదా పుక్కిలించడం లాంటివీ చేయకూడదు. ఎందుకంటే దాని తాలూకు ఇన్ఫెక్షన్ మిగిలిన ప్రాంతాలకూ వ్యాపిస్తుంది.