పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే ప్రతిపాదనలేదు..!


 పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆమె నేడు లోక్ సభలో మాట్లాడుతూ ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇంధన ధరలు స్థిరంగా లేవని వెల్లడించారు. ఒక రకంగా చూస్తే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ జీఎస్టీ జీరో రేటు కేటగిరిలో ఉన్నట్లే లెక్క అని ఆమె పేర్కొన్నారు.