నకిలీ వెబ్సైట్లలో ఆలయ సేవలు


రాష్ట్రంలోని రెండు ప్రముఖ ఆలయాలకు చెందిన ఆన్లైన్ సేవలను... కొందరు అనధికార వెబ్సైట్ల ద్వారా బుకింగ్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ సైట్లలో చిత్తూరు జిల్లా కాణిపాకం విఘ్నేశ్వరాలయం, కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయాల పూజలు, సేవలు బుకింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రెండు ఆలయాలకు చెందిన అధికారులు అక్కడి పోలీసులతోపాటు, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు.