టీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు ? ఆఫీసుల్లో పనులతో అలసిపోయినా.. ఇంటి పనులతో తలమునకలైనా మొదటిసారిగా గుర్తొచ్చేది టీ నే.. ఒక కప్పుటీ తాగడం వల్ల అప్పటి వరకూ ఉన్న ఒత్తిడి అంతా ఒక దెబ్బతో మాయం అవుతుంది . ఈ టీని తాగడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చైనీస్ వాళ్ళ నమ్మకం ఏంటి అంటే టీ తాగే వాళ్ళు ఎక్కువ బ్రతుకుతారు అంట .
వారి నమ్మకం నిజం అయితే మన దేశం లో అందరు ఎక్కువ కాలమే బ్రతుకుతారు .
టీ కేవలం ఆరోగ్య పరంగానే కాదు.. అందాన్ని కూడా మెరుగు చేస్తుందని చెబతున్నారు నిపుణులు. టీ తాగితే వయసు తగ్గి.. శరీరం ముడతలు పడకుండా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి రెగ్యులర్‌గా టీ తాగితే ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
ఒక కప్పు టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కప్పు పండ్ల రసం కంటే టీలోనే అధికంగా ఉంటాయి. కాబట్టి టీ ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు నిపుణులు. టీ తాగడం వల్ల ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్, దంతక్షయం వంటి ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.