దయచేసి జాగ్రత్తగా ఉండండి!


రైళ్లు, స్టేషన్లలో నేరాలు ఏటా పెరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్ తెలంగాణ పరిధిలో గత ఏడాది 1,255 నేరాలు నమోదుకాగా 2019 సంవత్సరంలో నవంబరు నాటికే ఆ సంఖ్య 1,358కి చేరింది. జరుగుతున్న చోరీలతో పోలిస్తే నమోదవుతున్న కేసులు తక్కువే. పోయినసొమ్ములో 80 శాతంపైగా దొంగలపాలవుతోంది. చైన్ స్నాచింగ్ 50 శాతం పెరగడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది.