హరీష్ రావును జిల్లాలో తిరగనివ్వం


సింగూరు జలాల తరలింపుతో సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు నీటి కష్టాలు వస్తాయని కాంగ్రెస్ MLA జగ్గారెడ్డి అన్నారు. హరీష్ రావు అనాలోచితంగా నీటిని తరలించడం వల్ల సంగారెడ్డి జిల్లాతో పాటు ఘనపూర్ ఆయకట్టు రైతులకు కూడా నీరందడం లేదన్నారు. నీటి సమస్యపై హరీష్ రావు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు జిల్లాలో తిరగనివ్వమని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో జిల్లా ఎమ్మెల్యేలపైనా జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.