హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి


 దిశ హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రేపిస్టులతో వ్యవహరించడం ఎలాగో తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకోవాలంటూ ఢిల్లీ BJP నేత కపిల్ మిశ్రా పేర్కొన్నారు. దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. "హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు. రేపిస్టులతో ఇలాగే వ్యవహరించాలి. మిగతా రాష్ట్రాల పోలీసులు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు.