కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశం నలుమూలలా నిరసనజ్వాలలు చెలరేగుతున్నాయి. తాజాగా, చెన్నైలోని వళ్లువార్ కొట్టంలో భారీస్థాయిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిర్వహించిన ఈ నిరసనలో హీరో సిద్ధా కూడా పాల్గొన్నాడు. ఈ ఆందోళనలో పాల్గొన్న నిరసనకారులపై పోలీసులు 143 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో హీరో సిద్ధార్డ్ పైనా కేసు నమోదైంది.