ప్రియాంకకు పురస్కారం


తన ప్రతిభతో అంతర్జాతీయ నటిగా ఎదిగిన ప్రియాంక చోప్రాకు మరో గౌరవం దక్కింది. సినీ రంగానికి ప్రియాంక చేస్తున్న సేవలకు గుర్తింపుగా మొరాకోలో జరుగుతున్న మర్రాకెచ్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో పురస్కారం అందజేశారు. దీంతోపాటు ప్రియాంక ఇటీవలే యూనిసెఫ్ నుంచి డానీ కైన్ హ్యూమనేటిరియన్ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆమెను ఈ చిత్రోత్సవంలో ప్రత్యేకంగా సత్కరించారు.