భారత్ పై వెస్టిండీస్ విజయం


సిమన్స్ (67*) చెలరేగడంతో భారత్ పై వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ రేసులో నిలబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 170 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్ 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పో యి లక్ష్యాన్ని ఛేదించింది. లూయిస్ (40), పూరన్ (38*) మెరిశారు. దీంతో మూడు టీ20ల సిరీసను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక ఆఖరి టీ20 డిసెంబర్ 11న ముంబయిలో జరగనుంది.