ఒక ప్రశ్న...ఒక జవాబు...


 మీ సినిమాను తెరపై చూసుకుంటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? తప్పొప్పుల్ని విశ్లేషించుకుంటారా? అని కియారా అడ్వాణీని ప్రశ్నించగా... తప్పకుండా విశ్లేషించుకుంటాను. నా దృష్టి నేను చేస్తున్న తప్పుల మీదే ఉంటుంది. నేను సినిమా చూస్తుంటే తెరపై నాకు నేను తప్ప మరే పాత్రా కనిపించదు. 'అరె.. ఈ సీన్ లో బొమ్మలా నిలబడిపోయానేంటి?', 'ఇలా చేయాల్సింది కదా..' అనుకుంటూ ఉంటాను. అందుకే నా సినిమా చూస్తుప్పుడు పూర్తిగా ఆస్వాదించలేను అని అంది.