ఉప్పల్ వేదికగా వెస్టిండీతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోహ్లి వ్యక్తిగత రికార్డులతో పాటు పలు రికార్డులు బద్దలు కొట్టాడు. పొట్టిఫార్మాట్ లో అత్యధిక సార్లు 50+ స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 68 ఇన్నింగ్లు ఆడిన కోహ్లి 23 సార్లు 50+ స్కోరు నమోదు చేశాడు. అతడి తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (22) ఉన్నాడు.
రికార్డుల మోత మోగించిన కోహ్లి