రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సాయం శూన్యం


 రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సాయం శూన్యమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేంద్రం సహకరించకపోయినా అన్ని హామీలు నెరవేరుస్తామని ఆయన తెలిపారు. మొదటి ఏడాది పాలన విజయవంతంగా కొనసాగిందన్నారు. కేసీఆర్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాలే నిదర్శనమని చెప్పారు. ప్రజలు వందశాతం తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని జగదీష్ రెడ్డి తెలిపారు.