ప్రభుత్వమేమీ పోస్ట్ మ్యాన్ కాదు: కేంద్ర మంత్రి


జడ్జిల నియామక ప్రక్రియలో ప్రభుత్వం భాగస్వామి అంతేగానీ పోస్ట్మ్య న్ కాదు' అని కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన ఓ విజ్ఞప్తిపై ఆయన పై విధంగా స్పందించారు. కోల్ కతా హైకోర్టులో అదనంగా కొందరు న్యాయమూర్తులను నియమించే అంశాన్ని పరిశీలించాలని ఎంపీ కోరగా మంత్రి పై వ్యాఖ్యలు చేశారు.