ఆకాశంలో అద్భుతం: ఆసక్తిగా తిలకించిన ప్రజలు


 ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సుమారు పది సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి సూర్యగ్రహణం ఆకాశంలో కనువిందు చేసింది. ఉదయం 8.15 నిమిషాలకు ప్రారంభమైన ఈ సుందర ఘట్టం దాదాపు 3 గంటల పాటు సాగింది. అరుదుగా సంభవించే ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు, చిన్నారులు, పెద్దలు ఆసక్తి చూపారు.