టైమ్స్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' తనే


 స్వీడన్ కు చెందిన బాలిక, ప్రముఖ వాతావరణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ ను 'పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులపై ప్రపంచ దేశాల విధాన రూపకర్తలు నూతన విధానాలు రూపొందించాల్సిందిగా గ్లోబల్ యూత్ మూమెంట్ పేరుతో ఏడాది కాలంగా ఈ స్వీడన్ బాలిక పోరాటం చేస్తోంది.