మెట్రోకు తగ్గిన ప్రయాణికులు


 సుదీర్ఘ కాలంగా కొనసాగిన RTC సమ్మెతో మెట్రో రైళ్లు నిత్యం కిటకిటలాడాయి. 52 రోజుల పాటు జరిగిన సమ్మెతో రెండు మెట్రో రైళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు నగరవాసులు ప్రయాణించారు. కాగా RTC సమ్మె ముగియడం, బస్సుల పునరాగమనంతో మెట్రోలో ప్రయాణికుల రద్దీ క్రమంగా తగ్గుతోంది. సమ్మె సమయంలో మెట్రోలో ప్రతి రోజూ 4లక్షల మందికి పైగా ప్రయాణం చేయగా, ప్రస్తుతం 20-30వేలకు తగ్గిందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు.