నిందితుల ఎన్‌కౌంటర్‌పై సినీ హీరో మంచు మనోజ్ స్పందించారు. నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్కుందా? అంటూ మనోజ్ ఎన్‌కౌంటర్పై ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. "ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది. నలుగురు చచ్చారు అనే వార్త లో ఇంత కిక్కు వుందా..? ఈ రోజునే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..! " అని మనోజ్ ట్వీట్ చేశాడు.