నేడు PSLV రిహార్సల్

 



 భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్.. రోజుల వ్యవధిలోనే మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈ నెల 11న మధ్యాహ్నం 3.25 గంటలకు నింగిలోకి పీఎస్ఎల్‌వీ-సి48 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించిన రిహార్సల్ సోమవారం చేపట్టనున్నారు.