ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPP) నిబంధనలను సవరించింది. దీని ప్రకారం ఖాతాదారు బాకీ ఉన్న మొత్తాన్ని జమచేయటం కోసం దేశంలో ఏ కోర్టు ఆర్డర్ లేదా డిక్రీ ఇచ్చినప్పటికీ, PPF ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఎటాచ్ చేయటం వీలుకాదు. పాత నిబంధనల స్థానంలో 'పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 2019' కొత్త నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
PPF ను సొమ్మును ఎటాచ్ చేయటం ఇకపై వీలుకాదు