ఫోన్ వాడాలంటే ముఖం స్కాన్ చేయాలి..!

 


 


నేటి నుంచి చైనాలో కొత్తగా మొబైల్ సర్వీసు వినియోగించాలంటే ముఖాన్ని స్కాన్ చేసి రిజస్టర్ చేసుకోవాల్సి ఉంది. ఈ నిబంధనను సెప్టెంబర్ లో చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం మాట్లాడుతూ "సైబర్ ప్రపంచంలో ప్రజలకు ఉన్న హక్కులు, అవకాశాలను ఈ చట్టం రక్షిస్తుంది" అని పేర్కొంది. చైనా ఇప్పటికే జనాభా లెక్కలకు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని వినియోగిస్తోంది.