సువాసనలు వెదజల్లే నెయ్యి ఆహారంలో రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి, సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కొంచెం నెయ్యిని గోరువెచ్చగా వేడి చేసి, చిట్లిన జుట్టుకు రాసుకొని ఓ గంట తరువాత కడగాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకల్లో పగుళ్లు పోయి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. పొడిబారిన చర్మం ఉన్న వాళ్లకి నెయ్యి మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. పెదవులు బాగా పొడిబారినప్పుడు పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల అవి చాలా మృదువుగా తయారవుతాయి.