రోగి శరీరాన్ని సురక్షితంగా పరీక్షించే అత్యాధునిక స్కానింగ్ విధానాన్ని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. సంప్రదాయ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ స్థానంలో తీసుకొచ్చిన ఈ విధానంతో కళ్లకు, చర్మానికి ఎలాంటి హాని ఉండదని వారు భరోసా ఇస్తున్నారు. "ఈ కొత్త విధానం ద్వారా శరీరంలోని ప్రతి భాగాన్నీ లోతుగా పరిశీలించి, కండరాల తీరును విశ్లేషించాం" అని పరిశోధనకర్త బ్రియాన్ ఆంటోనీ తెలిపారు.
కంటికి హాని చేయని సరికొత్త స్కానింగ్