మహారాష్ట్రలో భూప్రకంపనలు


 మహారాష్ట్రలో భూమి కంపించింది. నేడు తెల్లవారుజామున 5.20 గంటలకు ఫ్సార్ ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదు అయినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.