ముస్లింలను రెచ్చగొడుతున్న కాంగ్రెస్


 పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలను కాంగ్రెస్ రెచ్చగొడుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. జార్ఖండ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన మోదీ.. పౌరసత్వ బిల్లు వల్ల ఏ మతస్థులకు ప్రమాదం ఉండదన్నారు. గతంలోనూ ఈ విషయాన్ని చెప్పాను, ఇప్పుడు కూడా స్పష్టం చేస్తున్నానన్నారు. క్యాబ్ వల్ల ఏ మతస్థుడి పౌరసత్వంపై ప్రభావం ఉండదన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మోదీ విమర్శించారు.