'దిశ' నిందితుల ఎన్ కౌంటర్...తలనొప్పిగా మారిన మృతదేహాల


భద్రత హైదరాబాద్: షాద్నగర్ చటానపల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురి మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరచడం తలనొప్పిగా మారింది. కట్టుదిట్టమైన భద్రత కారణంగా వేర్వేరు కేసుల్లో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలకు పోస్టుమార్టం కోసం వచ్చే బంధువులతోపాటు మార్చురీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటి వద్దకు ఎవరూ రావద్దంటూ పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు.