సెన్సార్ బోర్డుపై షకీలా ఆగ్రహం

 



 నటి షకీలా సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల ఆమె నటించిన చిత్రం 'లేడీస్ నాట్ అలవ్' చిత్రాన్ని తిరస్కరించడంపై ఆమె బోర్డు సభ్యులను నిలదీశారు. ఈ సినిమాకు ఆమె నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే, పోస్ట్ పొజ్జాక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఇప్పటికే రెండుసార్లు సెన్సార్ బోర్డ్ సభ్యులు తిరస్కరించారు. ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి చేయడానికి కొందరు వ్యక్తులు డబ్బులు అడుగుతున్నారని షకీలా ఆరోపించారు.