వేరబుల్ సాంకేతికత రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే దిశగా కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. 'టిప్ ట్యాప్'గా పిలుస్తున్న ఆ పరికరం.. వేలి కొనల ద్వారా కంప్యూటరు ఆదేశాలు జారీ చేసేందుకు వీలు కల్పిస్తుంది. బ్యాటరీ అవసరం లేకపోవడం దాని మరో విశిష్టత. వేలి కొనలను స్పృశించినప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ RFID) ట్యాగులను ఉపయోగించుకుంటూ 'టిప్ ట్యాప్' పనిచేస్తుంది.
వేలి కొనలతో కంప్యూటర్ నియంత్రణ