మాతృభాషలో సభ నిర్వహణ గొప్ప విషయం


రాజ్యసభ 250వ సమావేశం ముగింపు సందర్భంగా వెంకయ్య నాయుడు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. "రాజ్యసభలో హిందీ, సంస్కృతం, మైథిలి, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాలీ, సంథాలి లాంటి మాతృ భాషల్లో మాట్లాడే సభ్యుల సంఖ్య పెరగడం సంతోషకరం. 67 ఏళ్ల రాజ్య సభ చరిత్రలో తొలిసారి సంథాలీ భాష సభలో వినిపించడం ఆనందించతగ్గ విషయం " అని అన్నారు.