అల్ప, మధ్యస్థ ఆదాయ దేశాల్లో చిన్నారులకు సరాసరిన తొలి ఐదేళ్లలో 25సార్లు యాంటీబయోటిక్ ఔషధాలను ఇస్తున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. ఇది చాలా ఎక్కువని తెలిపింది. సూక్ష్మజీవులను ఎదుర్కోవడంలో సదరు చిన్నారుల సామర్థ్యాన్ని ఇది దెబ్బతీస్తుందని హెచ్చరించింది. ఆఫ్రికాలోని టాంజానియాలో.. ఆసుపత్రులకు వెళ్లే చిన్నారుల్లో 90 శాతం మందికి యాంటీబయోటిక్ను ఇస్తున్నారు. అందులో ఐదో వంతు మందికే వాస్తవంగా ఆ మందులు అవసరమని నివేదిక తెలిపింది.
చిన్నారులకు పరిమితికి మించి యాంటీ బయోటిక్స్