వ్యక్తులపై పనిభారం ఎక్కువయ్యే కొద్దీ వారు అధిక రక్తపోటు బారినపడే ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. కెనడాలో కార్యాలయ విధులు నిర్వర్తించే 3,500 మంది ఉద్యోగులపై లవాల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారానికి 35 గంటలు పనిచేసేవారితో పోలిస్తే.. 50 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసేవారు అధిక రక్తపోటు బారినపడే ముప్పు 66 శాతం అధికంగా ఉంటున్నట్లు తేల్చారు.
పని ఒత్తిడితో పెరుగుతున్న రక్త పోటు