భూ కక్ష్యలో అంతరిక్ష వ్యర్థాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించే సరికొత్త లేజర్ ఆధారిత వ్యవస్థను పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. వ్యోమనౌకలు ఏ మార్గంలో కదిలితే సురక్షితంగా ఉంటాయో తెలుసుకోవడంలో ఖగోళ శాస్త్రవేత్తలకు తాజా వ్యవస్థ దోహదపడనుంది. ఈ నేపథ్యంలో మానవ మెదడు సెన్సరీ ఇన్పుట్ల ఆధారంగా అభివృద్ధి చేసిన విశిష్ట క్రమసూత్ర పద్ధతులను లేజర్ రేజింగ్ టెలిస్కోపులకు చైనా పరిశోధకులు జోడించారు.
తాజా అత్యంత కచ్చితత్వంతో అంతరిక్ష వ్యర్థాల గుర్తింపు