మద్యం అమ్మకాలే కారణం


 అబ్కారీ శాఖ పేరును మద్యం ప్రోత్సాహక శాఖగా మారిస్తే బాగుంటుందని CM కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సలహా ఇచ్చారు. రాష్ట్రంలో నేరాలు పెరగడానికి, మహిళలపై అఘాయిత్యాలు అధికం కావడానికి విచ్చల విడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలే కారణమన్నారు. రాష్ట్రంపై ఆర్థిక మాంద్యం ప్రభావం పడిందని చెబుతున్న కేసీఆర్ ...మద్యం అమ్మకాలు విస్తరించడం ద్వారా ఆదాయం పెంచుకోవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.