జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు BJP కి చెంపపెట్టు అని NCP, శివసేన వ్యాఖ్యానించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, BJP జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు జార్ఖండ్ ప్రజలు గర్వభంగం చేశారని NCP అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైన BJP పై ప్రజలకు విశ్వాసం సడలుతోందని శివసేన అధికార ప్రతినిధి మనీష కయాండే అభిప్రాయపడ్డారు.
మోడీ ,అమిత్ షా లకు గర్వ భంగం