CM గా తొలిసారి మోదీని కలిసిన ఉద్ధవ్


 మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. ప్రధాని మోదీని తొలిసారి కలిశారు. ఓ అధికారిక కార్యక్రమం నిమిత్తం లోహెగావ్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో పాటు ఉద్ధవ్ అధికారిక స్వాగతం పలికారు. విమానాశ్రయ ఆవరణలో ఇరువురు కాసేపు పలు అంశాలపై చర్చించారు.