CAA నిరసనలు  దిల్లీలో విమానాల రద్దు..


 


 పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో ఆందోళనల కారణంగా దిల్లీలో పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిల్లీ-గురుగ్రామ్ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రయాణికులు, విమాన సిబ్బంది ఎయిర్పోర్టుకు సమయానికి చేరుకోలేకపోయారు. దీంతో పలు విమానాలు ఆలస్యమయ్యాయి. ఇండిగో, ఎయిరిండియా లాంటి విమానయాన సంస్థలు తమ విమానాలను రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది.