నేలలో ఉరుముల ప్రకంపనలను పసిగట్టే టెలికం కేబుళ్లు


 ఉరుముల వల్ల భూమి లోపల తలెత్తే ప్రకంపనలను ఇంటర్నెట్, ఫోన్ సేవలకు ఉపయోగించే టెలికం లైన్ల సాయంతో పసిగట్టవచ్చని అమెరికా పరిశోధకులు గుర్తించారు. ఈ విషయంలో అవి భూ ప్రకంపనల నమోదుకు ఉపయోగించే సైస్మోమీటర్ల కన్నా మెరుగ్గా పనిచేస్తాయని వారు తెలిపారు. ప్రకృతి విపత్తులను గుర్తించడానికి, భూమి లోపలి భాగాలను చిత్రీకరించడానికి ఈ ఆవిష్కారం వీలు కల్పిస్తుందని చెప్పారు.