AP అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం


 AP అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ప్రారంభించారు. ఇవాళ సమావేశంలో భాగంగా మహిళల రక్షణపై చర్చ జరిగే అవకాశం ఉంది. శాసనసభ శీతాకాల సమావేశాల్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అధికార పక్షం సమాయత్తమైంది.