ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన వైమానిక దళ వింగ్ కమాండంర్ అభినందన్ విగ్రహాన్ని చాక్లెట్లో తయారు చేశారు. బెల్జియం నుంచి తీసుకొచ్చిన 321 కిలోల చాక్లెట్ లో దీన్ని రూపొందించారు. పుదుచ్చేరిలోని ప్రముఖ చాక్లెట్ కంపెనీకి చెందిన శ్రీకాంత్.. క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా చాక్లెట్ విగ్రహాలను తయారు చేస్తుంటారు. అభినందన్ విగ్రహాన్ని 5 అడుగుల ఎత్తు, 10 అంగుళాల వెడల్పుతో కంపెనీ చెఫ్ రాజేంద్రన్ .. సిబ్బంది సాయంతో /24 గంటలు శ్రమించి తయారు చేశారు.
అభినందన్ చాక్లెట్ విగ్రహం